నిర్భయ ఘటనపై సంచలన తీర్పు.. దోషులకు ఉరిశిక్ష ఖరారు..!

Tuesday, January 7th, 2020, 06:15:55 PM IST

నిర్భయ కేసులో ఏడేళ్ళ తరువాత సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులోని దోషులకు ఉరి శిక్షను ఖరారు చేస్తూ పాటియాల కోర్ట్ అంతిమ తీర్పునిచ్చింది. 2012 డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో బస్సులో ఎక్కిన యువతిని నలుగురు కలిసి అత్యాచారం చేసి దాడి చేసిన ఘటన దేశ వ్యాప్తంగా అందరిని కలిచివేసింది. అయితే దాదాపు 16 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29వ తేదీన నిర్భయ మృత్యువాత పడింది.

అయితే ఆ రోజు నుంచి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకున్న నిర్భయ తల్లితండ్రులకు, దేశ ప్రజానీకానికి శుభవార్త తెలుపుతూ న్యాయస్థానం అంతిమ తీర్పును ఇచ్చింది. దాదాపు ఏడేళ్ళ పాటు ఈ కేసులో అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోర్ట్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.