తలకిందులుగా జాతీయ జెండా…మంత్రి అవంతి ఫై దారుణ విమర్శలు!

Sunday, January 26th, 2020, 05:35:01 PM IST

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మరొకసారి రాష్ట్రం లో హాట్ టాపిక్ అయ్యారు. జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం జిల్లా భీమిలి నియోజకవర్గం లో జాతీయ జెండా ని ఎగరవేశారు. అయితే అది కాస్త తలకిందులుగా దర్శనం ఇచ్చింది. అయినప్పటికీ అక్కడ వున్న వారంతా జాతీయ గీత ఆలాపన చేసారు. అనంతరం అక్కడికి చేరుకున్న అధికారులు ఆ విషయాన్నీ గమనించి సరిచేసి మళ్ళీ ఎగరవేశారు. విషయాన్ని మంత్రికి తెలియజేసారు. ఈ విషయం పట్ల మంత్రి అవంతి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేసారు. చూసుకోవాల్సిన పని లేదా? అంటూ అధికారుల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయితే ఇది మొదటిసారి కాదని, రెండోసారి అవంతి ఇలా చేసారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారం లోకి వచ్చాక రివెర్స్ టెండరింగ్ పేరుతో ఎలా అయితే మార్పులు చేర్పులు చేసిందో, ఇది కూడా అలానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని రివర్స్ మాత్రమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ తో ఎంతో ఆదాయం మిగిలిన, అభివృద్ధి జరగడం లేదనేది టీడీపీ నేతలు వాదన, అలానే రాష్ట్రాభివృద్ధి కూడా రివర్స్ లోనే ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.