నటరాజన్ కి థార్ ఎస్యూవీ కార్ గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా…రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చాడో తెలుసా?

Friday, April 2nd, 2021, 11:02:32 AM IST

ఆస్ట్రేలియా పర్యటన లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అరంగేట్రం సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ ఆటగాళ్లకు థార్ యూ ఎస్ వీ కార్లను బహుమతి గా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో దక్కించుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే యువ ఆటగాళ్ళు అయిన నవదీప్ సైని, నటరాజన్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్ లు జట్టు విజయం లో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మేరకు ఆనంద్ మహీంద్రా వారికి కార్లను బహుమతి గా అందించారు.

అయితే తాజాగా నటరాజన్ కార్ అందుకున్నాడు. అయితే అందుకు నటరాజన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది కాస్త ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. గబ్బా టెస్ట్ మ్యాచ్ లో చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియా, ఆ టెస్ట్ లో తను ధరించిన జెర్సీ ను బహుమతి గా ఇచ్చాడు నటరాజన్. టీమ్ ఇండియా కి ఆడటం గర్వకారణం అని, అది తన జీవితం లో అతి పెద్ద గర్వకారణం అంటూ చెప్పుకొచ్చారు. తన ఎదుగుదల అంతా కూడా అనూహ్యంగా జరిగింది అని అన్నారు. అయితే తన ఈ ప్రయాణం లో వెన్నుతట్టి ఉన్న వారికి, ప్రోత్సాహం ఇస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతూనే, మహీంద్రా థార్ కార్ ను బహుమతి గా ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, ఆయితే క్రికెట్ పట్ల ఉన్న అమితమైన ప్రేమకు గుర్తుగా తన గబ్బా టెస్ట్ జెర్సీ ను గుర్తు గా ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు. మహేంద్ర సైతం నటరాజన్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.