బ్రేకింగ్: ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్..!

Thursday, September 3rd, 2020, 09:30:07 AM IST

ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ట్విటర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. narendramodi_in పేరుతో ఉన్న ఖాతాను నేడు తెల్లవారు జామున తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే హ్యాక్ చేసిన వెంటనే ఆ ఖాతా నుంచి రెండు వరుస ట్వీట్లు చేసి దుమారం రేపారు. అయితే భారత్‌లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ప్రారంభమయ్యాయని, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు క్రిప్టో కరెన్సీ రూపంలో ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించండి అంటూ ఒక ట్వీట్ చేశారు.

ఆ తరువాత ఈ ఖాతాను జాన్ విక్‌కు చెందిన బృందం హ్యాక్ చేసిందని మేం పేటీఎం మాల్‌ను హ్యాక్ చేయలేదని చెబుతూ మరో ట్వీట్ చేశారు. ఈ తెల్లవారు జామున ఉదయం 03:15 సమయంలో ఈ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. అయితే హ్యాకర్ల బారినపడిన ఈ ట్విటర్ ఖాతా ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కు సంబంధించినది తప్ప వ్యక్తిగత ట్విటర్ ఖాతా కాదని అది కేవలం వెబ్‌సైట్‌కు చెందినది మాత్రమే అని ప్రస్తుతం ఆ ఖాతాను ఆధీనంలోకి తీసుకున్న ట్విటర్ ఇండియా టీమ్ హ్యాకర్లు వెంటనే ఆ ట్వీట్లను తొలగించింది.