త్వరలోనే విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతా – నారా రోహిత్

Sunday, March 14th, 2021, 01:19:32 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఇప్పటికే నారా రోహిత్ మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించిన నారా రోహిత్ నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలని అన్నారు. నేటి ఉద్యమస్పూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలని, విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ అని అన్నారు. ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి అని, ఉక్కు పోరాటంలో నన్నూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనాలు అని చెప్పుకొచ్చారు.

అయితే తెలుగోడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని, సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం నా నైజం కాదు, సాటి ఆంధ్రుడికి కష్టమెచ్చినప్పుడు అండగా నిలబడతానని, తెలుగుజాతి ఆత్మ గౌరవంపై దాడి జరుగుతోందని యువతా.. మేలుకో.. నీ పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలుకు అని సూచించారు. త్యాగధనుల పోరాటఫలం పరాధీనమవ్వకుండా పిడికిలి బిగించాలని, తెలుగువారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదలిరా అంటూ త్వరలోనే విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి తాను మద్దతు తెలుపుతానని నారా రోహిత్ అన్నాడు.

నేటి విశాఖ ఉక్కు పోరాటం రేపటి వెలుగుకు నాంది కావాలి. నేటి ఉద్యమస్పూర్తి రేపటి ప్రగతికి బాట వేయాలి. విశాఖ ఉక్కు రెండు…

Posted by Nara Rohith on Friday, 12 March 2021