పదో తరగతి పరీక్షలను రద్దు చేయండి.. సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ..!

Thursday, May 13th, 2021, 04:45:39 PM IST


ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సీఎం జగన్‌కు నారా లోకేశ్ మరోసారి లేఖ రాశారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ గారికి లేఖ రాసాను. మరో 3 వారాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరిని పాస్ చేయండని లోకేశ్ లేఖ ద్వారా కోరారు.

అయితే పొరుగున ఉన్న తెలంగాణ సహా దేశంలో మరో 12రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షల్ని రద్దుచేశాయని, పలు మార్లు విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశాల్లో కోవిడ్ భయానికి తోడు పరీక్షల పట్ల ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో వారు నా దృష్టికి తీసుకొచ్చారని, కోవిడ్ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు భయపడే పరీక్షల నిర్వహణపై సమయాన్ని వృథా చేయొద్దు. పరీక్షలు నిర్వహించరాదనే విద్యార్థుల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చి పరీక్షల రద్దు నిర్ణయం ప్రకటించాలి. హైకోర్టు లేదా ప్రతిపక్ష నాయకులు ఆందోళనలతో కాకుండా మానవత్వంతో ఆలోచించి వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించాలని కోరినట్టు నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.