సీఎం జగన్‌కి లేఖ రాసిన నారా లోకేశ్.. ఏం కోరారంటే?

Saturday, February 6th, 2021, 03:00:24 AM IST


ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్రం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుండడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తూ కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి నారా లోకేశ్ సీఎం జగన్‌కి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టోద్దంటూ జగన్ గారికి లేఖ రాసానని అన్నారు.

అంతేకాదు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని అన్నారు. సొంత ఐరన్ మైన్ ని కేటాయించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చెయ్యాలని, 40 వేల మంది ప్రత్యక్షంగానూ, లక్షలమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని సూచించారు.