ఉద్యమం తప్పదు.. జగన్ సర్కార్‌కు డెడ్‌లైన్ ప్రకటించిన నారా లోకేశ్..!

Monday, December 14th, 2020, 10:00:29 PM IST

Nara_Lokesh

వైసీపీ సర్కార్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డెడ్‌లైన్ విధించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. వ‌ర‌ద‌లు, తుఫాన్ల‌తో న‌ష్ట‌పోయిన రైతాంగాన్ని ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. ఈ నెలాఖ‌రులోగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకోక‌పోతే ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు.

అయితే 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఒక్క‌ ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే 10,000 కోట్ల రూపాయలు పంట‌ల‌ను రైతులు న‌ష్ట‌పోయారని, వ‌ర‌దలు, తుఫాన్ల వలన న‌ష్ట‌పోయిన రైతాంగాన్ని ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైందని అన్నారు. పంట న‌ష్ట‌ప‌రిహారం లెక్కించ‌డంలోనూ జగన్ ప్రభుత్వం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించిందని మండిపడ్డారు.