వారిని ఆదుకోండి.. జగన్ సర్కార్‌కి నారా లోకేశ్ సరికొత్త డిమాండ్..!

Sunday, August 23rd, 2020, 10:28:54 PM IST

Nara Lokesh

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సరికొత్త డిమాండ్ వినిపించారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలంటూ జగన్ గారికి లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి నేతన్నల తరపున 4 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నానని అన్నారు. ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ వినిపించారు.

సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ కింద 24,000 రూపాయలు ఇవ్వాలని, సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి 1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలని అన్నారు. నేతన్న దగ్గర ఉన్న స్టాక్ ని ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలని కోరారు.