ఏలూరు ఘటనపై కేంద్ర మంత్రి హర్షవర్దన్‌కు నారా లోకేష్‌ లేఖ..!

Tuesday, December 8th, 2020, 01:02:27 AM IST


ఏలూరులో వింత వ్యాధి తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే ఈ అంతు చిక్కని వ్యాధి కారణంగా వందల మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. ఏలూరు పట్టణంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని లేఖ ద్వారా కోరారు.

వింత వ్యాధి కారణంగా ఏలూరులో వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని తక్షణం ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. అయితే రికవరీ రేటు అధికంగా నమోదు చేసేందుకు బాధితులను త్వరగా డిశ్చార్జ్‌ చేస్తున్నారని, మాస్ హిస్టీరియా అంటూ ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.