కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన నారా లోకేశ్.. ఏం కోరారంటే?

Monday, September 28th, 2020, 06:06:37 PM IST

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ లేఖ రాశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించాలని కోరారు. చేనేత ఆదాయంలో స్థిరమైన పెరుగుదలకి కారణమైన బ్రాంచ్ కార్యాలయం ప్రాంతీయ కార్యాలయంగా అభివృద్ధి చెందిందని అన్నారు.

అయితే విజయవాడ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్‌ రూ.80 కోట్లుగా ఉందని, దీన్ని బ్రాంచ్‌ కార్యాలయంగా కుదించడం సరికాదని అన్నారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని బ్రాంచ్ కార్యాలయంగా కుదించినప్పటికీ మంత్రి కిషన్ రెడ్డి గారి జోక్యంతో ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, అలానే విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని కూడా పునరుద్ధరించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికే కరోనా వల్ల చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు.