సీఎం జగన్ కి నారా లోకేష్ లేఖ…అసలు కారణం ఇదే!

Sunday, April 18th, 2021, 06:02:18 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసినట్లు నారా లోకేష్ తెలిపారు. అయితే జూన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 15 లక్షలకు పైగా విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉందని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం అని నారా లోకేష్ అన్నారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయం లో విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం తగదు అంటూ చెప్పుకొచ్చారు. అందుకే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం ఆలోచన చేయాలి అంటూ నారా లోకేష్ సూచించారు. నారా లోకేష్ రాసినటువంటి లేఖ కి సీఎం జగన్ మరియు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.