సీఎం జగన్ కి నారా లోకేష్ లేఖ… ఏం ప్రస్తావించారు అంటే?

Wednesday, February 10th, 2021, 06:00:03 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ నిర్మాణం ఆలస్యం అవుతుంది అని పార్లమెంటు సాక్షిగా కేంద్ర వైద్య ఆరోగ్య సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే ప్రకటించారు అని నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించారు. అంతేకాక చెత్త ఇసుక విధానం, కనీస మౌలిక వసతులు కల్పించక పోవడం వల్లనే ఎయిమ్స్ నిర్మాణం నత్త నడకన నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణం కి అన్ని విధాలా సహకరించాలి అని లేఖ రాసినట్లు నారా లోకేష్ పేర్కొన్నారు.

నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పాలనా విధానంపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నారా లోకేష్ మరొకసారి సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేయడం తో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయంగా మారింది.