సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్… ఎందుకంటే?

Wednesday, May 5th, 2021, 04:22:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక గా కృతజ్ఞతలు తెలిపారు. అయితే మియో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాసిన విషయం ను వెల్లడించారు. అయితే మూడు వారాల పాటు ఆందోళన, న్యాయ పోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే స్ఫూర్తి తో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని, లేదంటే రద్దు చేయాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు.

అయితే సీఎం జగన్ కి రాసిన లేఖ లో పలు విషయాలను ప్రస్తావించారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా పరీక్షల నిర్వహణ లక్ష దాటడం లేదని అన్నారు. అయితే కరోనా వైరస్ ఉదృతి తీవ్రంగా ఉండటం తో పాటుగా ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత తో రోగులు చనిపోతున్న ఘటనలు తెలియనివి కావు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కరోనా వైరస్ ఉదృతి తగ్గుముఖం పడితే జూన్ మొదటి వారంలో పరిస్థితుల పై సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత అందుకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ పై తుది నిర్ణయం తీసుకోవాలి అంటూ సూచించారు. అయితే నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.