చెరువును తలపిస్తున్న రోడ్లతో ప్రజల బాధలు వర్ణనాతీతం – నారా లోకేష్

Tuesday, October 27th, 2020, 08:00:49 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ వర్షాల కారణంగా రైతులకు తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగింది. పేద ప్రజల ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడం తో ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉండి నియోజక వర్గం, సిద్దాపురం గ్రామంలోని చాకలి పేటలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు నారా లోకేష్. పరిస్థతి చాలా దారుణంగా ఉందని తెలిపారు. ఇంట్లో అడుగు మేర పేరుకుపోయిన బురద మరియు బయట చెరువును తలపిస్తున్న రోడ్ల తో ప్రజల బాధలు వర్ణనాతీతం అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

అయితే సిద్దాపురం లోని నీట మునిగిన ఇళ్లను పరిశీలించి, ఆ ప్రాంత ప్రజలను ఓదార్చారు. ప్రభుత్వం ముంపు గురించి కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేయడం తో ఉన్నదంతా నీటిపాలు అయి, కట్టు బట్టలతో మిగిలాం అంటూ కలింగపేట గ్రామస్తులు నారా లోకేష్ తో చెబుతూ కన్నీరు పెట్టుకున్న విషయాన్ని వెల్లడించారు. అయితే వారికి ధైర్యం చెప్పిన అనంతరం తణుకు బయలుదేరినట్లు నారా లోకేష్ తెలిపారు.