వైకాపా నాయకులకు ఇంకా బుద్ధి రాలేదు-.. నారా లోకేశ్ అల్టీమేట్ ట్వీట్..!

Wednesday, December 2nd, 2020, 08:00:30 PM IST

ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలలో పాల్గొనాల్సి ఉన్నా వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకుని సభకు రావడం లేదు. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ బాధ్యత లేని అధికార పక్షానికి, బాధ్యత ఉన్న ప్రతిపక్షానికి తేడా ఇదే అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశాడు.

అంతేకాదు #ఛోవీడీఓట్శ్ అని జాతీయ మీడియా ఉతికారేసిన తరువాత కూడా వైకాపా నాయకులకు బుద్ధి రాలేదని, సూపర్ స్ప్రెడర్స్ గా మారి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని అన్నారు. వేల మంది చనిపోయిన తరువాత కూడా జగన్ మూర్ఖత్వాన్ని వదలడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణ కారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే వైకాపా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారని లోకేశ్ అన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి, వైకాపా నాయకులు మాస్క్ వేసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.