జగ్గూ గ్యాంగ్ ది చీప్ మెంటాలిటీ.. నారా లోకేశ్ అల్టీమేట్ కామెంట్స్..!

Monday, February 15th, 2021, 07:30:35 PM IST

వైసీపీ దురంహకార పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకి ఓటు వెయ్యలేదనే కారణంతో నరసరావుపేట నియోజకవర్గం, ఇస్సాపాలెం పరిధిలోని శిశుమందిర్ వద్ద ఇళ్ల ముందు డ్రైనేజ్, మెట్లు కొట్టేసిన చీప్ మెంటాలిటీ జగ్గూ గ్యాంగ్ ది అని వైఎస్ జగన్ విధ్వంస పాలనకు ఇది పరాకాష్ట అని అన్నారు.

అంతేకాదు గోగులపాడు పంచాయతీలో అత్యధిక వార్డులను టీడీపీ కైవసం చేసుకోవడం జీర్ణించుకోలేక స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు, పోలీసులు దగ్గర ఉండి ప్రజలపై దౌర్జన్యం చెయ్యడం దారుణమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వైకాపా నాయకులకి ప్రజలు తగిన శిక్ష విధించే రోజు దగ్గర్లోనే ఉందని నారా లోకేశ్ అన్నారు.