జగన్‌కి పాలించే అర్హత ఉందా.. నారా లోకేశ్ సూటి ప్రశ్న..!

Tuesday, December 15th, 2020, 12:47:27 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. రైతుల ప్రాణాలను బలితీసుకుంటున్న జగన్‌కి అసలు పాలించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. చేతగాని మంత్రులు సమాధానం చెప్పాలని అన్నారు. రైతుల కష్టాలను, ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మంత్రులు మాట్లాడటం దారుణమని, 18 నెలల పాలనలో 468 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.

48 గంటల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో రైతు హరిబాబు, ప్రకాశం జిల్లాలో రైతు రమేశ్ ఆత్మహత్యకి పాల్పడిన ఘటనలు నన్ను తీవ్రంగా బాధించాయని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఈ దుస్థితి రావడానికి జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలే కారణమని ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని అన్నారు. రైతులకు న్యాయం చెయ్యమని అడిగే అర్హత లోకేష్ కి లేదంటున్న మంత్రులు చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాగలరా అని నిలదీశారు. మంత్రులు నన్ను ప్రశ్నించడం మాని జగన్ రెడ్డిని నిలదీస్తే రైతులకు న్యాయం జరుగుతుందని, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.