మహిళలకు న్యాయం జరిగెదెప్పుడు.. వైసీపీ సర్కార్‌కు నారా లోకేశ్ సూటి ప్రశ్న..!

Friday, October 16th, 2020, 12:16:49 AM IST


విజయవాడలో ప్రేమోన్మాది దాడిలో దివ్య తేజస్విని బలవ్వడం ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ సర్కార్‌కు ఓ సూటి ప్రశ్న వేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న దివ్య ప్రేమోన్మాది చేతిలో బలైపోవడం దారుణమని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. అయితే వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అయితే వారం రోజుల వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, వరుసగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా జగన్ గారు మౌనం వహించడం సరికాదని అన్నారు. చట్టరూపం దాల్చని దిశ చట్టం, ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లు, అధికారంలేని హోంమంత్రి గారు అంటూ ఇక మహిళలకు న్యాయం జరిగెదెప్పుడు అని ప్రశ్నించారు.