బెంజ్ మినిస్టర్ లీలలు అన్నీ ఇన్నీ కావు.. నారా లోకేశ్ సూటి ప్రశ్న..!

Sunday, September 20th, 2020, 02:00:47 PM IST

Nara_Lokesh

ఏపీ కార్మికశాఖ మంత్రి జయరాం కుమారుడి బెంజ్ కారు విషయం ఇప్పడు ఏపీలో హాట్ టాఫిక్‌గా మారింది. ఈఎస్ఐ స్కాంలో ఆ-14 నిందితుడుగా ఉన్న వ్యక్తి మంత్రి జయరాంకు బినామి అని, అందుకే ఆ వ్యక్తి మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు బెంజి కారు లంచంగా ఇచ్చాడని ఆరోపిస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశాడు.

అయితే దీనిపై తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించిన నారా లోకేశ్ ఈఎస్ఐ స్కాంలో బెంజ్ మినిస్టర్ లీలలు అన్నీ ఇన్నీ కావు అంటూ బెంజ్ కారు ఈఎస్ఐ స్కాంలో ఆ-14 నిందితుడు కార్తీక్ ది అంటున్న మంత్రి కారుపై, ఆయన ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకుందో చెప్పగలరా అని ప్రశ్నించారు. కార్తీక్ చెప్పిన ఏ పనైనా తక్షణమే చెయ్యాలని జయరాం గారు శాఖలో అధికారులను ఆదేశించింది నిజం కాదా అని ప్రశ్నించారు.