ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం.. నారా లోకేశ్ సూటి ప్రశ్న..!

Tuesday, December 8th, 2020, 09:00:08 PM IST

Nara_Lokesh

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదల కారణంగా వేలాది ఎకరాల పంట నీట మునిగింది. అయితే చేతికొచ్చిన పంట నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమకు సాయం అందిచాలని వేడుకుంటున్నారు. అయితే దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు.

సర్వం కోల్పోయిన రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారని, కౌలు రైతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న వేడుకుంటున్నా జగన్ మనస్సు కరగడం లేదని, ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం అని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రైతులను ఆదుకోవాలని, పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.