ఇంకెంత మందిని అరెస్ట్ చేయిస్తావ్.. సీఎం జగన్‌కు నారా లోకేశ్ సూటి ప్రశ్న..!

Thursday, January 21st, 2021, 03:00:42 AM IST

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూటి ప్రశ్న వేశారు. రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం త‌ల ఎత్తుకెళ్లిన వారిని ప‌ట్టుకోలేక‌పోయిన చేత‌కాని స‌ర్కారు, అత్యంత సౌమ్యుడైన బీసీ నేత‌ టీడీపీ పొలిట్ ‌బ్యూరో స‌భ్యుడు కిమిడి క‌ళావెంక‌ట‌రావు గారిని అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అధికారం అండ‌తో ఇంకెంత‌మంది బీసీ నేత‌లపై త‌ప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తావు జగన్ అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటన సమయంలో ఆలయ పర్యటనకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్ మీద చెప్పులు విసిరిన కేసులో కళా వెంకట్రావు హస్తం ఉందని పోలీసులు అయనను అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం వద్ద కళా వెంకట్రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు.