ఏపీలో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీపై విమర్శలు గుప్పించారు. గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా జగన్ గారు అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే అధికారంలోకొచ్చాక 500 ఇస్తామనడం రివర్స్ టెండరింగ్లో భాగమా అని నిలదీశారు.
నివర్ తుఫాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతన్న నడ్డి విరిచిందని, సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి కోట్లపైన పంట నష్టం వాటిల్లింది. వరుస తుఫాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారం ఇవ్వరు. గాల్లో మేడలు కడుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అంతులేని తుఫాను నష్టం తెలుస్తుందని లోకేశ్ అన్నారు. అంతేకాది మీ సాక్షి మీడియా ప్రకటనలు, భజన బ్యాచ్ నుంచి వాస్తవంలోకొస్తే అన్నదాతల ఆర్తనాదాలు వినపడతాయని, తాడేపల్లి గడప దాటి ప్రజల్లోకొస్తే జనం కన్నీళ్లు కనిపిస్తాయని అన్నారు.
గాల్లో తిరుగుతూ, గాలి కబుర్లు చెబితే రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా @ysjagan గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరదసాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే!(1/4)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 28, 2020
వరుస తుఫాన్లు, వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారం ఇవ్వరు. గాల్లో మేడలు కడుతూ, గాలి తిరుగుళ్లు ఆపి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అంతులేని తుఫానునష్టం తెలుస్తుంది.(3/4)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 28, 2020