ఇదేనా మీరు తెస్తానన్న రైతు రాజ్యం.. జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న..!

Tuesday, October 27th, 2020, 05:09:30 PM IST

ఏపీలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల చేతులకు పోలీసులు బేడీలు వేసి వారి నిరసన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేసారని, రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేసారు. ఇదేనా జగన్ గారు తెస్తానన్న రైతు రాజ్యం అని రైతులకు బేడీలు వేసిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అంతేకాదు 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే, తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు, అమరావతిని చంపేస్తుంటే ఎంత కోపం రావాలి అని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి తక్షణమే వారిని విడుదల చేయాలని, లేదంటే, న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేశ్ హెచ్చరించారు.