జనభేరితో జగన్‌కి మబ్బులు విడిపోయాయి – నారా లోకేశ్

Friday, December 18th, 2020, 12:00:11 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనభేరీతో జగన్‌కి మబ్బులు విడిపోయాయని అన్నారు. ప్రజలు, ప్రాంతాలు, పార్టీలు ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని అంటూ అమ‌రావ‌తికి జై కొట్టాయ‌ని జ‌న‌భేరీతో తేలిపోయిందని చెప్పుకొచ్చారు. మూడుముక్క‌లాట‌కు క‌ట్టుబ‌డిన జగన్ రెడ్డికి చంద్ర‌బాబు గారు రెఫ‌రెండం స‌వాల్ విసిరారని అన్నారు.

అయితే చంద్రబాబు గారు ఇచ్చిన సవాల్ స్వీకరించే దమ్మందా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఛాలెంజ్‌కి స్పందించాల్సింది నువ్వే! నీ గేటు ద‌గ్గ‌ర ఊర‌కుక్క‌లు కాదని అన్నారు. ఇదిలా ఉంటే నేడు అమరావతి రైతులు ఏర్పాటు చేసిన జనభేరీ సభకు హాజరైన చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.