చేతకాని దద్దమ్మ ప్రభుత్వానికి సిగ్గా ఎగ్గా.. నారా లోకేశ్ కామెంట్స్..!

Tuesday, October 20th, 2020, 01:27:49 AM IST


ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. వేలా ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. అయితే నేడు కృష్ణా, గోదావరి జిల్లాల మీదుగా సీఎం జగన్ హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. దీంతో వరద కారణంగా నష్టపోయిన ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేశారు. అయితే దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన నారా జగన్‌పై సెటైర్లు వేశారు.

గాలి కబుర్లు చెప్పడం, గాల్లో పర్యటించడం తప్ప జగన్ గారికి ప్రజల బాధలు ఏం కనిపిస్తాయి. ఒకపక్క వరదల వల్ల ప్రజలు వాళ్ళ సర్వస్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే, ఈయన గారు గాల్లో పర్యటన చేస్తున్నారని, ఏ.. ప్రజల్లోకి వస్తే అసలు సిసలు సన్మానం తప్పదని భయమా? లేక వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సరైన స్క్రిప్ట్ ఇంకా అందలేదా అని ప్రశ్నించారు. అయినా అవినీతిలో నిండా మునిగినవారికి ప్రజలు వరదల్లో మునిగితే ఏంటి? ఇంకెలా పోతే ఏంటి? చేతకాని దద్దమ్మ ప్రభుత్వానికి సిగ్గా ఎగ్గా అని ఎద్దేవా చేశారు.