మూర్ఖత్వానికి మానవ రూపం జగన్.. నారా లోకేశ్ సెటైర్లు..!

Thursday, September 24th, 2020, 11:28:18 AM IST

Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో సెటైర్లు గుప్పించారు. ఏపీలో లక్షల్లో కరోనా కేసులు, వేల సంఖ్యలో ప్రజల చనిపోతున్నారని అయినా జగన్ గారు మాత్రం మూర్ఖత్వానికి మానవ రూపంగానే మిగిలిపోయారని అన్నారు.

అయితే మీడియాతో ఫోటోలు దిగే సమయంలో జగన్ మాస్క్ పెట్టుకోలేదు, అంతేకాదు ఆయన పక్కనున్న వారిని కూడా మాస్కులు తీయండి చెబుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నారా లోకేశ్ ఆయన మాస్క్ పెట్టుకోరు, వేరే వాళ్ళు పెట్టుకుంటే ఊరుకోరు ఎని ఎద్దేవా చేశారు. మరి ఇలాంతప్పుడు దళిత యువకుడు కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టిచంపడం ఎందుకు అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌లో కిరణ్‌ని చంపింది మాస్క్ వేసుకోలేదనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు.