దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం ఇది – నారా లోకేశ్

Saturday, October 31st, 2020, 09:28:03 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నంపెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేశారని, అన్నదాతల త్యాగాల పునాదిని సమాధి చేసే కుట్రలు పన్నారని ఆరోపించారు. అంతేకాదు ఐదుకోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్లజూస్తున్నారని అన్నారు.

అయితే మహిళలపై పోలీసులు దాడి చేస్తూ ఈడ్చుకెళ్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే మహిళలపై దుశ్శాసనపర్వం సాగిస్తున్న దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం ఇది అని, నీ లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు నీ పతనాన్ని శాసిస్తారు, ప్రజారాజధానిని శాశ్వతం చేస్తారని చెప్పుకొచ్చారు.