28 మంది ఎంపీలు ఉండి ఎందుకు దండగ.. వైకాపాపై లోకేశ్ మండిపాటు..!

Tuesday, March 9th, 2021, 04:51:05 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి క్లారిటీ రావడంతో ఏపీలో నిరసనలు మరింత ఉదృతమయ్యాయి. అయితే దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంది. జగన్ కొంటున్నాడు. ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగం ఏంటి అని లోకేశ్ ప్రశ్నించారు.

అంతేకాదు విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని, అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందని, విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం, వైకాపా నాయకుల డ్రామాలు ఆపాలని లోకేశ్ అన్నారు.