వైసీపీ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి.. నారా లోకేశ్ డిమాండ్..!

Thursday, November 12th, 2020, 03:00:00 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలపై మీ ప్రతాపమా జగన్ రెడ్డి అని ఒక చెల్లెమ్మ ప్రశ్నిస్తోందని, దానికి మీరు ఏం సమాధానం చెబుతారు అంటూ ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ప్రశ్నించారు. ఆలీబాబా 40 దొంగల తరహాలో మీరు, మీ ఎమ్మెల్యేలు ప్రజలపై పడి దోచుకుంటున్నారని అన్నారు.

మీ రౌడి పాలన కారణంగా కర్నూలు జిల్లాలో శ్రీ లక్ష్మీదేవి గారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు ఓబులరెడ్డి భూకబ్జాకి పాల్పడ్డారని అన్నారు. నంద్యాలలో ఉన్న భూమిని బలవంతంగా లాక్కోవడానికి శ్రీ లక్ష్మీదేవి గారిని బెదిరించి ఏడాదిగా హింసిస్తున్నారని, మహిళల్ని వేధిస్తున్న వైకాపా ఎమ్మెల్యేల పై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.