ముస్లిం సోదరులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు.. వైసీపీపై నారా లోకేశ్ ఫైర్..!

Tuesday, April 13th, 2021, 11:13:03 PM IST


ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముస్లిం సోదరులతో కలిసి నెలవంక చూసి రంజాన్ మాసానికి స్వాగతం పలికానని, నేటి నుండి పవిత్రమైన రంజాన్ మాసం మొదలవుతుండడం సంతోషంగా ఉంది ముస్లింలు ఈ రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం పాటిస్తారని అన్నారు.

అయితే అలా పాటించడం వల్ల పేదవారు ఎదుర్కొనే కష్టాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మైనార్టీ సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం. కానీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోగా వారిని వెంటాడి వేధిస్తోందని అన్నారు.