ఎవరిది శవ రాజకీయం.. వైసీపీ సర్కార్‌పై మండిపడ్డ నారా లోకేశ్..!

Thursday, December 31st, 2020, 01:25:32 AM IST

Nara_Lokesh
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్ళిన నారా లోకేశ్ అనంతరం మృతదేహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ శవ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటుండడంతో వారి వ్యాఖ్యలకు నారా లోకేశ్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు.

ఎవరిది శవ రాజకీయం? తండ్రి శవం దొరక్క ముందే సంతకాలు సేకరించిన జగన్ రెడ్డిదా లేక బాబాయ్ శవాన్ని ఎన్నికల ఎజెండాగా వాడుకున్న జగన్ రెడ్డిదా? హత్యలు చేయిస్తూ ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్న జగన్ రెడ్డిదా? హత్యకు గురైన నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన చంద్రబాబు గారిదా అని ప్రశ్నించారు.