ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. నారా లోకేశ్ డిమాండ్..!

Thursday, December 24th, 2020, 02:30:23 PM IST


ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో నిన్న జరిగిన స్నేహలత దారుణ హత్య యావత్ రాష్ట్రాన్ని కన్నీరు పెట్టించింది. అయితే దీనిపై మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేశ్ జగన్ గారి నిర్లక్ష్య ధోరణి కారణంగా అనంతపురంలో
బంగారు భవిష్యత్తు ఉన్న దళిత బిడ్డ స్నేహాలత బలైపోయిందని, రక్షించాలని వేడుకుంటూ ఏడ్చి,ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి అని ఒక తల్లి విలపిస్తుందని, ప్రేమ పేరుతో కూతుర్ని, కుటుంబాన్ని టార్చర్ చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేస్తే ఇళ్ళు మారమని సలహా ఇచ్చింది వైకాపా ప్రభుత్వం.

ఇక కూతురు కనపడటం లేదంటూ ఫోన్ చేస్తే ఉదయం చూద్దాం అంటూ పోలీసుల సమాధానం, దిశ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే నీది ఏ రాష్ట్రం అని ప్రశ్నించి పోయి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్కోమని ఉచిత సలహా. కాపాడుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థత కారణంగా చదువులోనూ, స్పోర్ట్స్ లోనూ రాణించిన స్నేహాలత ప్రయాణం అర్దాంతరంగా ముగిసిపోయింది. అత్యంత కిరాతకంగా స్నేహాలత ని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, స్నేహాలత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.