అధికారం ఇచ్చింది ఇందుకేనా.. వైసీపీ సర్కార్‌పై లోకేశ్ సీరియస్..!

Saturday, October 24th, 2020, 01:21:10 AM IST

Nara Lokesh
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే నేడు అనంతపురం జిల్లాలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి రైతులతో మాట్లాడితే వాళ్ళను ఏ రకంగా ఆదుకోవాలో తెలుస్తుందని, రాజభవనాల్లో కలెక్షన్లు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే ప్రజల కన్నీటిని తుడిచేదెవరని ప్రశ్నించారు.

అంతేకాదు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని కూడా నిలదీశారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ రైతుల కష్టాలు వర్ణనాతీతమని వేరుశనగ రైతులకు రూ. 2 వేల కోట్ల పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు రూ. 25 లక్షల పరిహారం మాత్రమే ఇవ్వడం ఏంటి అని ఇలా చేస్తే రైతు ఏమై పోవాలని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 25 వేలు పరిహారంగా ఇవ్వాలని అలా అయితేనే కానీ రైతు కోలుకునే పరిస్థితి ఉండదని అన్నారు.