అవి పోలీస్ స్టేషన్లా.. లేక వైకాపా నాయకుల ఫ్యాక్షన్ డెన్లా – నారా లోకేశ్

Friday, October 2nd, 2020, 02:16:28 PM IST

దళితులపై జగన్ సర్కార్ దమనకాండ పరాకాష్టకు చేరిందని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విచారణ అని పిలిచి విజయవాడ, కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు అజయ్ ని కొట్టి చంపేశారని, అనారోగ్యంతో చనిపోయాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు బయట పడతాయనే భయంతో కుటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారన్నారు.

అయితే దుర్గ గుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, దళిత యువకుడికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని పోలీస్ స్టేషన్‌లో కొట్టి చంపారు, ఇసుక అక్రమ రవాణాకి అడ్డొచ్చాడని వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేసారు. ఇప్పుడు విచారణ పేరుతో అజయ్ ని బలితీసుకున్నారు అని మండిపడ్డారు. అసలు అవి పోలీస్ స్టేషన్లా? లేక వైకాపా నాయకుల ఫ్యాక్షన్ డెన్లా అని నిలదీశారు.