రోజుకో హత్య, పూటకో రేప్.. జగన్ పాలనపై నారా లోకేశ్ సీరియస్..!

Tuesday, December 29th, 2020, 06:30:05 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ పాలనపై మండిపడ్డారు. ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత, జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ అన్నారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న కక్షతో ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిని దారుణంగా బలితీసుకున్నారు. హత్యలు చేయడం వీరత్వం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

జగన్ పాలన అంటే రోజుకో హత్య, పూటకో రేప్ అన్నట్టుగా తయారైందని, ఇది పోలీసుల వైఫల్యం కాదా? వైసీపీ ఎమ్మెల్యే, అతని బావమరిది చేస్తోన్న అక్రమాలను బయటపెట్టిన సుబ్బయ్య హత్య వెనుక వాళ్ళిద్దరూ ఉన్నారన్నది స్పష్టమవుతోంది. పోలీసులు వెంటనే సుబ్బయ్య హంతకులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.