దళితులపై దాడులు చేసేందుకు లైసెన్స్ ఇచ్చారా.. సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్..!

Monday, April 19th, 2021, 05:38:24 PM IST

Nara_Lokesh

ఏపీలో రోజు రోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. దౌర్జ‌న్యాల‌కు ప్యాంటు, అక్ర‌మాల‌కు షర్టు వేసిన‌ట్టుండే య‌‌ల‌మంచిలి వైసీపీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు అరాచ‌కాల‌కు హ‌ద్దే లేకుండా పోయిందని, నియోజ‌క‌వ‌ర్గంలో క‌న్నబాబు చేసిందే చ‌ట్టం, చెప్పిందే వేదం, క‌న్నుప‌డితే క‌బ్జా ఖాయమని అన్నారు.

అయితే రాంబిల్లికి చెందిన ద‌ళితుడు భూపతి అప్పారావు (పండు) త‌న‌కు ఎమ్మెల్యే అనుచ‌రుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని 22-03-2021న పోలీసుల‌కు ఫిర్యాదు ఇవ్వ‌డ‌మే చేసిన పాపంగా చంపేయ‌డానికి య‌త్నించారు రౌడీ ఎమ్మెల్యే అనుచ‌రులు. ద‌ళితుల‌పై ద‌మ‌న‌కాండ సాగించేందుకు త‌న ఎమ్మెల్యేల‌కు జగన్ ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? ఇలా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు.