రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!

Friday, April 9th, 2021, 12:05:18 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వెంకటగిరిలో ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నానని, జగన్ కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు వివరించానని, వివేకా గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చెయ్యడానికి సిద్ధమని సవాల్ చేసి 24 గంటలు అయ్యిందని ఇప్పటి వరకూ జగన్ రెడ్డి గారు స్పందించలేదని అన్నారు. అయితే ఈ నెల 14న తిరుపతి వస్తున్న జగన్ రెడ్డి గారు శ్రీ వారి సాక్షిగా ఆయనకి, ఆయన కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.