జగన్‌ రెడ్డి గుర్తు పెట్టుకో.. వడ్డీతో సహా చెల్లిస్తాం – నారా లోకేశ్

Wednesday, March 31st, 2021, 07:32:08 PM IST

Nara Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా లక్కరాజుగార్లపాడులో ఇటీవల టీడీపీ నేత కృష్ణారావు వైసీపీ నేతల దాడిలో మరణించాడు. ఈ నేపథ్యంలోనే కృష్ణారావు కుటుంబసభ్యులను నేడు లోకేశ్ పరామర్శించారు. అనంతరం మీడియాతొ మాట్లాడిన నారా లోకేశ్ అరాచకాలలో బీహార్‌తో ఏపీ పోటీ పడుతోందని అన్నారు.

అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ వైసీపీ నేతలు రాక్షస ఆనందం పొందుతున్నారని, జగన్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని రేపు అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని మీరు చేస్తున్న అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ హెచ్చరించారు. పోలీసులు లేకుండా జగన్ ప్రజల్లోకి వస్తే తరిమికొడతారని, మహిళా హోంమంత్రి ఉన్నా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ అన్నారు.