వాలంటీర్ వ్య‌వ‌స్థ‌తో బెదిరించి ఓట్లేయించుకున్నారు.. వైసీపీపై నారా లోకేశ్ ఫైర్..!

Friday, March 19th, 2021, 03:51:45 PM IST

Nara Lokesh

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైసీపీ మూక‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన సత్తెనపల్లె రూరల్ మండలం లక్కరాజుగార్లపాడు టీడీపీ కార్య‌క‌ర్త గరికపాటి క్రిష్ణారావు హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందార‌ని ఈ స‌మాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యానని, కృష్ణారావు కుటుంబానికి అన్నివిధాలా అండ‌గా నిలుస్తామ‌ని లోకేశ్ హామీ ఇస్తున్నట్టు తెలిపాడు.

అయితే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా జ‌ర‌గాల్సిన ఎల‌‌క్ష‌న్‌ని ఫ్యాక్ష‌న్ చేసిన జగన్ నామినేష‌న్ వేశార‌న్న కార‌ణంతో కొంద‌రిని చంపేశారు. వైసీపీకి ఓట్లు వేయ‌క‌పోతే ప‌థ‌కాలు తీసేస్తామ‌ని వాలంటీర్ వ్య‌వ‌స్థ‌తో బెదిరించి మ‌రీ ఓట్లేయించుకున్నారు. ఇన్ని అరాచ‌కాలకు ఎదురొడ్డి గెలిచిన టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ను చివ‌రికి అంతం చేస్తున్నారు. అయినా తెలుగుదేశం భ‌య‌ప‌డ‌దు, టీడీపీ కార్య‌క‌ర్త‌లూ భ‌య‌ప‌డ‌రు. నీ నియంత పాల‌న‌ని అంత‌మొందించేవ‌ర‌కూ పోరాడుతూనే ఉంటామని లోకేశ్ హెచ్చరించారు.