జగన్ రెడ్డి చెత్త పరిపాలనే అందుకు కారణం – నారా లోకేశ్

Friday, March 12th, 2021, 03:32:21 PM IST

Nara-Lokesh

వైసీపీ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక పక్క జగన్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మునిగి తేలుతుంటే, మరోపక్క అన్నదాతలు అప్పులపాలై నేలకొరుగుతున్నారని, వ్యవసాయాన్ని నమ్ముకున్న దంపతులు ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందక ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

అయితే ఆళ్లగడ్డ నియోజకవర్గం, పి.చింతకుంట గ్రామంలో రైతు సంజీవరెడ్డి దంపతులు వ్యవసాయ పెట్టుబడి కోసం తీసుకున్న 11 లక్షలు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారని, వారి ముగ్గురు పిల్లలు అనాధలుగా మారడానికి జగన్ రెడ్డి చెత్త పరిపాలనే కారణమని అన్నారు. అంతేకాదు ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జగన్ రెడ్డి నిద్రలేస్తాడని ప్రశ్నించారు. సంజీవరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.