పచ్చని చెట్లకు జగన్ గ్యాంగ్ నిప్పు పెట్టింది.. నారా లోకేశ్ మండిపాటు..!

Thursday, March 11th, 2021, 06:15:23 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ నేతలపై మరోసారి మండిపడ్డారు. జగన్ మార్క్ ఫ్యాక్షన్ ఎలెక్షన్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం నేరం. సైకిల్ గుర్తుకు ఓటేయడం పాపం. టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేక పచ్చని చెట్లకు జగన్ గ్యాంగ్ నిప్పు పెట్టిందని అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 13వ వార్డ్‌కి చెందిన టీడీపీ అభ్యర్థి బండి షంషాద్ బేగంకు మద్దతుగా దళితుడైన కల్లబోతుల రంగన్న ప్రచారం చేశాడనే కక్షతో ఆయన 10 ఎకరాలలో కొబ్బరి, టేకు, ఎర్రచందనం చెట్లకు వైసీపీ మూకలు నిప్పు పెట్టాయని, ఇది జగన్ అరాచకాలకు పరాకాష్ట అని లోకేశ్ మండిపడ్డారు. ఎన్నికలు పూర్తి అయినా జగన్ ఫాక్షన్ కక్షతోనే పాలన సాగిస్తున్నారు. జగన్ పై ప్రజలే తిరగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని లోకేశ్ అన్నారు.