పిరికి పాలకుడు జగన్ అరాచకాలు ఇంకెన్నాళ్లు.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Monday, March 1st, 2021, 04:02:49 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని అందుకు నిరసనగా చిత్తూరులోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వచ్చిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తనను ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై చంద్రబాబు పోలీసుల తీరుపై మండిపడ్డారు. అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై స్పందించిన నారా లోకేశ్ 2019లో పల్నాడు వెళ్లకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టి అడ్డుపడ్డారు. 2020 లో విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా చుట్టుముట్టారు.

2021లో రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించారు. పిరికి పాలకుడు జగన్ అరాచకాలు ఇంకెన్నాళ్లు అని, ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు అవుతాయని, డెమోక్రసిని జగనోక్రసీతో అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేత హక్కులు హరిస్తున్న ప్రతీ సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది కాబోతోందని నారా లోకేశ్ అన్నారు.