రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది – నారా లోకేశ్

Saturday, February 20th, 2021, 05:15:36 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ ప్రధ్దాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ దేవుడెరుగు పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని, నెల్లూరు జిల్లా సైదాపురం మండలం, గ్రిద్దలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివశంకర్ గారిపై వైకాపా గూండాలు విచక్షణారహితంగా దాడి చెయ్యడం దారుణమని అన్నారు.

అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు. ఎస్ఐ శివశంకర్ గారి పై దాడి చేసిన వైకాపా రౌడీలను కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.