అక్రమ అరెస్టులు జగన్ పిరికిపంద చర్యలకు నిదర్శనం – నారా లోకేశ్

Thursday, February 18th, 2021, 05:50:31 PM IST

Nara-Lokesh

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టును తప్పుపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు జగం పిరికిపంద చర్యలకు నిదర్శనమని, పంచాయతీ ఎన్నికల్లో వెంటాడుతున్న ఓటమి భయంతోనే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి లోపల వేస్తున్నారని ఆరోపించారు.

అయితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని, బి. సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదం జరిగిన సమయంలో అసలు అక్కడ లేని వ్యక్తిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యడం రాజారెడ్డి రాజ్యాంగానికి మాత్రమే చెల్లిందని, తక్షణమే చింతమనేని ప్రభాకర్ గారిని విడుదల చెయ్యాలని, వైకాపా యూనిఫామ్ వేసుకొని వారు చెప్పినట్టు ఆడుతున్న కొంతమంది పోలీసు అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నారా లోకేశ్ హెచ్చరించారు.