గ్రామాల్లో జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి.. నారా లోకేశ్ సీరియస్..!

Thursday, February 4th, 2021, 08:20:32 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో బెదిరింపులు, దాడులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే గ్రామాల్లో జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ధర్మవరం నియోజకవర్గం వైకాపా నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఎన్నికల్లో వైకాపాకి ఓటు వెయ్యకపోతే కాళ్ళు విరగ్గొడతా అంటూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని అన్నారు.

అంతేకాదు నాకు ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేవు.. భయం భక్తి లేకపోతే బలైపోతారు జాగ్రత్త అంటూ సుధాకర్ రెడ్డి బెదిరిస్తున్న ఫోన్ కాల్‌ను కూడా లోకేశ్ భయటపెట్టాడు. అయితే వైకాపా నాయకుల బెదిరింపులు పోలీసులుకు మాత్రం వినపడవు, కనపడవని, మానవత్వాన్ని మరిచి మూర్ఖంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీస్ శాఖకు లేదా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.