వైకాపా నేతల ధనదాహం తీరలేదు.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Thursday, June 4th, 2020, 12:06:14 AM IST


వైకాపా నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల డబుల్ దోపిడీ.పేదల రక్తం తాగుతున్న వైకాపా నేతల భూదందాని కళ్ళకు కట్టింది 10 టీవీ స్టింగ్ ఆపరేషన్ ఆంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి విమర్శలు గుప్పించారు.

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ కొన్ని చోట్ల 7 లక్షలు కూడా విలువ చెయ్యని భూమిని 45 లక్షలకు కొని భారీ అవినీతికి తెరలేపారని, రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల ప్రజా ధనాన్ని కొట్టేసారని అన్నారు. అక్కడితో వైకాపా నేతల ధన దాహం తీరలేదు ఇప్పుడు పట్టా కావాలంటే క్యాష్ కొట్టాల్సిందే అంటూ లబ్ధిదారులను వేదిస్తున్నారని అన్నారు.

మహిళలు పుస్తెలు అమ్మి వైకాపా అవినీతి దాహాన్ని తీర్చే పరిస్థితి. పట్టాకి 20వేళ నుండి లక్షన్నర వసూల్ చేస్తున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ఈ రేంజ్లో జే టాక్స్ వసూలు చేస్తుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ లెక్చర్ ఇస్తున్నారు జగన్ గారు అని, ఇళ్ల స్థలాల స్కామ్ పై విచారణ జరిపితే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకు వస్తాయని అన్నారు.