మీ బెదిరింపుల‌కు అద‌రం.. మీ దాడుల‌కు బెద‌రం – నారా లోకేశ్

Tuesday, February 2nd, 2021, 05:45:45 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాంపై వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అయితే ఆధారాలతో సహా జగన్ అవినీతి పాలనను ఎండగడుతున్నారన్న కక్షతోనే పట్టాభిని ల‌క్ష్యంగా చేసుకుని జ‌గ‌న్‌రెడ్డే దాడులు చేయిస్తున్నారని అన్నారు.

అయితే మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడ‌తాం అని బెదిరించ‌డంపై పోలీసుల‌కు ఫిర్యాదుచేస్తే క‌నీసం ప‌ట్టించుకోలేదని, జాతీయ అధికార ‌ప్ర‌తినిధి ప‌ట్టాభికి వైసీపీ మంత్రులే వార్నింగ్ ఇచ్చి మ‌రీ గూండాల‌తో దాడి చేయించారంటే ఎంత‌గా బ‌రి తెగించారో అర్థ‌మ‌వుతోందని, మీ బెదిరింపుల‌కు అద‌రం. మీ దాడుల‌కు బెద‌రం. మీ అరాచక‌‌పాల‌న‌ని అంత‌మొందించి తీరుతామని అన్నారు.