ఏపీని బీహార్‌లా మార్చేశాడు.. జగన్ సర్కార్‌పై లోకేశ్ సీరియస్..!

Sunday, January 31st, 2021, 12:00:38 AM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు. ఏపీని జగన్ బీహార్‌లా మార్చేశాడని, నాడు-నేడు స్కీంలో భాగంగా నాడు పచ్చనిసీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్ష‌న్‌సీమ‌ చేసారని, గన్ రాకముందే జగన్ వస్తాడని గాలి కబుర్లు చెప్పారు. ఇప్పుడు రివర్స్ లో జ‌గ‌న్ రెడ్డి కంటే ముందు ఆయ‌న పెంచిపోషిస్తోన్న ఇసుక‌ మాఫియా గ‌న్‌లతో వ‌చ్చి తూర్పుగోదావరి జిల్లా, లంక‌ల గ‌న్న‌వ‌రంలో రెచ్చిపోయిందని ఎద్దేవా చేశారు.

అంతేకాదు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని, ఇసుకని బంగారం చేసారు, ఇప్పుడు గన్నులు పట్టుకొని ప్రజలపై పడ్డారు వైకాపా ఇసుకాసురులు అని స్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు, ప్రజల ప్రాణాలు తీస్తారని నారా లోకేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.