ఓటమి భయంతోనే జగన్ పంచాయితీ ఎన్నికలు వద్దన్నాడు – నారా లోకేశ్

Saturday, January 30th, 2021, 12:00:52 AM IST

Nara_Lokesh

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ల పర్వ మొదలయ్యింది. అయితే ఎక్కువ పంచాయితీ స్థానాలను ఏకగ్రీవం చేయాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ప్రభుత్వం పిలుపునిచ్చిన ఏకగ్రీవాలు ఇలాగేనా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఓటమి భయం వెంటాడటం వలనే జగన్ పంచాయతీ ఎన్నికలు వద్దన్నాడని, చెత్త పాలనతో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేక రాజారెడ్డి రెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకుంది జగన్ అండ్ గ్యాంగ్ అని విమర్శలు గుప్పించాడు.

అయితే తెలుగుదేశం అభ్యర్థులకు ఫోన్ చేసి నామినేషన్ వేస్తే నీ అంతూ చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు వైకాపా రౌడీలు అంటూ దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. అంతేకాదు టీడీపీ అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో నిలబడటం, ఓటు రూపంలో ప్రజలు జగన్ రెడ్డి అంతు చూడటం దేవుడి స్క్రిప్ట్ ప్రకారం జరగడం ఖాయమని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.